- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొదట్లో నన్ను చూసి నవ్వారు.. కలవడానికి కూడా ఎవరూ ఇష్టపడలేదు: నటి ఎమోషనల్
దిశ, సినిమా: ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో దర్శకనిర్మాతలతో ఎదుర్కొన్న ఇబ్బందులపై ఓపెన్ అయింది నటి ఎల్నాజ్ నోరౌజీ. ఆమె నటించిన ‘మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2’ ఆగస్టు 10న విడుదలవగా తను పోషించిన పాత్రకుగానూ ప్రశంసలు అందుకుంటుంది. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ సమావేశంలో కెరీర్ అనుభవాలు పంచుకుంటూ.. ‘దర్శనిర్మాతలు మొదట్లో నన్ను కలవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే నా పేరు చెప్పగానే నన్ను విదేశీ మోడల్‌గా చూశారు. కొంతమంది నన్ను చూసి నవ్వారు. నేను హిందీ మాట్లాడతానని, చదవడం, రాయడం కూడా వచ్చని నిరూపించుకోవడానికి కొన్నేళ్లు పట్టింది. అవకాశాలు రావడం చాలా కష్టం అయింది. నేను చెప్పేది ఎవరూ వినిపించుకునేవారు కాదు’ అంటూ ఎమోషనల్ అయింది. అయితే ఈ అనుభవాలన్నీ తనలో కసిని పెంచాయన్న నటి.. ‘నేను ఎవరనేది నిరుపించుకోవాలి. నా కల ఇక్కడే నిజం కావాలి. ప్రజలు నన్ను పొగిడే రోజు రావాలి. అందుకోసం కఠినంగా పనిచేయాలనే తపనతో అన్నింటికీ కట్టుబడి ఉంటూ ఎదిగాను’ అని చెప్పింది. చివరగా ఈ రోజుల్లో చిత్రనిర్మాతలంతా నటులు రోబోల పనిచేయాలని కోరుకుంటున్నారని వాపోయింది.
- Tags
- Elnaaz Norouzi