- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
భర్తతో విడాకులపై స్పందించిన అసిన్.. నా జీవితంలో 5 నిమిషాలు వృథా అంటూ..
దిశ, వెబ్‌డెస్క్: ‘గజినీ’ సినిమాతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ అసిన్. తెలుగుతో పాటు బాలీవుడ్‌లో కూడా పలు సినిమాలు చేస్తూ.. తన అందంతో, నటనతో అలరించింది. కెరీర్ జోరుమీద ఉన్న సమయంలో 2016లో అసిన్ మైక్రోమ్యాక్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మని వివాహం చేసుకుని.. సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయింది. ప్రస్తుతం అసిన్‌కు ఓ పాప ఉండటంతో ఫ్యామిలీ లైఫ్‌ని లీడ్ చేస్తుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ అమ్మడు తాజాగా తన ఇన్‌స్టా నుంచి భర్త ఫొటోలను డిలీట్ చేసింది. దీంతో.. అసిన్ భర్త నుంచి విడాకులు తీసుకుంటుంది. అందుకే సోషల్ మీడియా నుంచి ఆయన ఫొటోలు డిలీట్ చేసిందంటూ నెట్టింట వార్తలు హాట్‌గా వైరల్ అయ్యాయి.
తాజాగా ఈ వార్తలపై స్పందించిన అసిన్ ‘‘ప్రస్తుతం నేను నా భర్తతో సమ్మర్ వెకేషన్ మధ్యలో ఉన్నాం. ఇప్పుడు మేము ఇద్దరం పక్కపక్కనే కూర్చుని బ్రేక్ ఫాస్ట్ ఎంజాయ్ చేస్తున్నాం. సడెన్లీ ఈ న్యూస్ చాలా బేస్ లెస్‌గా అనిపించింది. అప్పట్లో మా పెళ్లికి ముందు కూడా మాపై రూమర్స్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఏకంగా విడిపోయామంటు వార్తలు రాస్తున్నారు. నిజంగా..? ఏదైనా కొత్తగా ప్రయత్నించండి. నా జీవితంలో 5 నిమిషాలు వృథా అయినట్లు అనిపిస్తుంది. లేదంటే హాలీడే టిప్ ఇంకా బాగా ఎంజాయ్ చేసే వాళ్లం’’ అంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.
Read More: ఈ వయసులో అలా ఉండటం నా వల్ల కాదు.. అన్నీ ఆస్వాదించాల్సిందే!