Shivam Bhaje: అశ్విన్ బాబు ‘శివం భజే’ సినిమా ట్రైలర్ రిలీజ్..

by Hamsa |
Shivam Bhaje: అశ్విన్ బాబు ‘శివం భజే’ సినిమా ట్రైలర్ రిలీజ్..
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరోల కానుండి స్టార్స్ వరకు ట్రెండ్‌కి తగ్గట్లుగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం డివోషనల్ ట్రెండ్ నడుస్తోంది. అయితే ఈ తరహా స్టోరీలు తెరకెక్కించిన సినిమాలు జనాలను ఆకట్టుకోవడంతో పాటుగా బ్లాక్ బస్టర్ హిట్‌‌గా నిలుస్తున్నాయి. ఈ కాన్సెప్ట్‌తో ఇటీవల వచ్చిన కల్కి బ్లాక్ బస్టర్ అయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు టాలీవుడ్ హీరో అశ్విన్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘శివం భజే’. డైరెక్టర్ అప్సర్ తెరకెక్కిస్తుండగా.. డివోషనల్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనిని గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌‌పై మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మిస్తున్నాడు.

అయితే ఇందులో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. శివం భజే మూవీ ఆగస్టు 1న వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో.. మేకర్స్ ప్రమోషన్స్‌లో భాగంగా వరుస అప్డేట్స్ విడుదల చేస్తున్నారు. తాజాగా, శివం భజే మూవీ ట్రైలర్ విడుదల చేశారు. ఇందులో ఎన్ఐఏ గూఢచారి స్పెషల్ ఏజెంట్‌గా అశ్విన్ బాబు కనిపించాడు. మొదట్లోనే విలన్స్‌ను చితకొడుతూ మాస్ లుక్‌లో అదరగొట్టాడు. ఓ మిషన్ కోసం పోరాడుతున్న హీరోగా కనిపించాడు. అయితే దానిని చేధించాడా? లేదా అసలు దాని వెనుక ఉన్నది ఎవరు అనేది తెలుసుకున్నాడా? లేదా అనేది కథ. అయితే ఈ సినిమా శివుడు బ్యాక్ డ్రాప్‌ని జోడించి ట్రెండ్‌కు తగ్గట్లు మేకర్స్ మేకింగ్ చేశారు.


Advertisement

Next Story