Ashu Reddy : వారిపై పరువు నష్టం దావా వేస్తా ..(వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2023-07-04 07:55:12.0  )
Ashu Reddy : వారిపై పరువు నష్టం దావా వేస్తా ..(వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: ‘కబాలీ’ తెలుగు వెర్షన్ ప్రొడ్యూసర్ కేపీ చౌదరి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే కేపీ చౌదరితో అషురెడ్డికి చాలా కాల్స్ ఎక్స్ ఛేంజ్ అయినట్లు వార్తలు వచ్చాయి. ఇదే అంశంపై అషురెడ్డి ఇన్ స్టా వేదికగా ఓ వీడియో విడుదల చేశారు. కొన్ని మీడియా ఛానళ్లు తనను కించపరిచే విధంగా వార్తలు రాశాయని అషురెడ్డి ఫైర్ అయ్యారు. పేరు, తన మొబైల్ నంబర్ సైతం టెలికాస్ట్ చేశాయన్నారు. దీంతో మొబైల్ నంబర్‌కు నాన్ స్టాప్‌గా కాల్స్ వస్తున్నాయని తెలిపారు. దీంతో తన ఫోన్ నంబర్‌ను వాడలేకపోతున్నా అంటూ మండిపడ్డారు. తనను కించపరిచేవిధంగా వ్యవహిరించిన మీడియా ఛానళ్లపై పరువు నష్టం దావా వేస్తానని అషురెడ్డి అన్నారు. కేపీ చౌదరితో తాను మాట్లాడినట్లు కథనాలు వస్తున్నాయి. ఆ విషయంలో తన వద్ద అన్నీ ఆధారాలు ఉన్నాయన్నారు. తనపై ఆరోపణలు చేస్తుంటే మౌనంగా ఉండలేక వీడియో పోస్ట్ చేస్తున్నట్లు తెలిపారు.

ఆ నటుడితో ప్రేమలో ఉన్న కార్తీక దీపం మోనిత.. అతను ఎవరంటే?

Advertisement

Next Story