గోల్డెన్‌ లెగ్‌ అంటే నేను ఒప్పుకోను: Samyuktha Menon (సంయుక్త మీనన్)

by Prasanna |   ( Updated:2023-04-22 12:07:29.0  )
గోల్డెన్‌ లెగ్‌ అంటే నేను ఒప్పుకోను: Samyuktha Menon (సంయుక్త మీనన్)
X

దిశ, సినిమా: ‘భీమ్లా నాయక్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రి ఇచ్చిన సంయుక్త మీనన్ తాజాగా విడుదలైన ‘విరూపాక్ష’తో తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఈ మూవీ సక్సెస్‌తో వరుసగా నాలుగు హిట్‌లను తన ఖాతాలో వేసుకున్న నటిని తెలుగు చిత్ర పరిశ్రమ గోల్డెన్‌ లెగ్‌గా పిలుస్తుంది. అయితే తనను ఇలా పరిగణించడంపై రీసెంట్‌గా స్పందించిన సంయుక్త.. ‘ఈ గోల్డెన్ లెగ్ కాన్సెప్ట్ నాకు అర్థం కాదు. హీరోయిన్‌ను గోల్డెన్ లేదా ఐరన్ లెగ్ అనడంలో అర్థం లేదు. సినిమా హిట్ అయినా లేదా ఫ్లాప్ అయినా ఆ బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంటుంది. ఇలా అనడం వల్ల మమ్మల్ని తక్కువ చేసినట్లే అవుతుంది. సక్సెస్ సాధిస్తే మేము లక్కీ, లేకుంటే అన్ లక్కీ అనడంలో అర్థం లేదు. ప్రతి సినిమా వెనకాల చాలా కష్టం ఉంటుంది. సరైన స్క్రిప్ట్‌లను ఎంచుకుని, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తే విజయం కచ్చితంగా వరిస్తుందని నా నమ్మకం’ అని చెప్పుకొచ్చింది.

Read More:

ఆ విషయంలో నా పేరెంట్స్ సంతృప్తిగా లేరు: రష్మిక ఎమోషనల్

Advertisement

Next Story

Most Viewed