Prabhas: ప్రభాస్‌పై అర్షద్ వార్సీ కీలక వ్యాఖ్యలు.. అతని యాక్టింగ్ అలా ఉంటుందంటూ

by Hamsa |
Prabhas: ప్రభాస్‌పై అర్షద్ వార్సీ కీలక వ్యాఖ్యలు.. అతని యాక్టింగ్ అలా ఉంటుందంటూ
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు అర్షద్ వార్సీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘కల్కి’ మూవీలో లుక్ జోకర్‌లా ఉందంటూ చేసిన కామెంట్స్ ఇటీవల సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో డార్లింగ్ అభిమానులు ఆయనపై పలు ట్రోల్స్ చేశారు. తాజాగా, ఇదే విషయంపై ఐఫా 2024 లో పాల్గొన్న అర్షద్ వార్షీ క్లారిటీ ఇచ్చారు. నేను అతని లుక్‌ను ఉద్దేశించే కామెంట్ చేశా కానీ హీరోని కాదు అని తెలిపారు.

అర్షద్ మాట్లాడుతూ.. ‘‘విషయం ఏదైనా సరే ప్రతి ఒక్కరికీ ఓ అభిప్రాయం ఉంటుంది. అలా నా కూడా ఉంది కాబట్టి కల్కి సినిమాలోని పాత్ర గురించి మాత్రమే మాట్లాడాను. వ్యక్తి గురించి కాదు. ప్రభాస్ అద్భుతమైన నటుడు. దీనిని ఆయన ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. గొప్ప నటులు ఇలాంటి పాత్రలు చేస్తే ప్రేక్షకులు బాధపడతారు అని అలా చెప్పాను. ఇండియన్ సినిమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. వివిధ భాషలకు చెందిన నటీనటులందరూ కలిసి ఒక సినిమా కోసం వర్క్ చేయడం చూస్తుంటే సంతోషంగా అనిపిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed