బికినిలో చిల్ అవుతున్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. ఫోటోలు వైరల్

by Kavitha |
బికినిలో చిల్ అవుతున్న అర్జున్ రెడ్డి బ్యూటీ.. ఫోటోలు వైరల్
X

దిశ, సినిమా: ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ అయిన హీరోయిన్ షాలిని పాండే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో వరుస సినిమాలతో దూసుకపోతుంది అనుకున్నారు. కానీ ఈ అమ్మడుకి అనుకున్న రేంజ్‌లో అయితే ఆఫర్లు రాలేదు. తర్వాత ఇద్దరి లోకం ఒకటే, 118, 100% కాదల్ వంటి సినిమాల్లో నటించిన సరైనా హిట్ పడలేదు తన అకౌంట్‌లో. దీంతో కొన్ని రోజులుగా సోషల్ మీడియాకే పరిమితం అయింది. అర్జున్ రెడ్డి టైమ్‌లో బొద్దుగా ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు సన్నజాజి తీగలా సన్నగా తయారైంది. తన హాట్ హాట్ స్టిల్స్‌తో కుర్రకారుకి మతి పోగోడుతుంది. కానీ ఏం లాభం అవకాశాలు మాత్రం కరువయ్యాయి. అటు నార్త్ వాళ్లు.. ఇటు సౌత్ వాళ్లు షాలినిని పూర్తిగా మర్చిపోయారు. దీంతో అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో అందాల విందు చేస్తూ అభిమానులకు టచ్‌లో ఉంటుంది. ఈ క్రమంలోనే ఈమె ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

తాజాగా షాలిని సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో సీ గ్రీన్ బ్రాలెట్‌.. టైట్ ఫిట్ నల్లటి షేప్ వేర్ ధరించి ఫోటోలకి పోజులిచ్చింది. అది చూసిన నెటిజన్లు వెరీ హాట్ బ్యూటీ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట సూపర్‌గా వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story