Arjun-Malaika Arora: బ్రేకప్ కన్ఫామ్.. కనీసం ముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడని జంట (వీడియో)

by Hamsa |
Arjun-Malaika Arora: బ్రేకప్ కన్ఫామ్.. కనీసం ముఖాలు చూసుకోవడానికి కూడా ఇష్టపడని జంట (వీడియో)
X

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు డేటింగ్ చేయడం కామన్ అయిపోయింది. ఇలా కొందరు పెళ్లి బంధంతో ఒక్కటైతే మరికొందరు మాత్రం కొద్ది కాలం తర్వాత బ్రేకప్ చెప్పుకుని విడిపోతున్నారు. అయితే దాదాపు ఐదేళ్ల నుంచి బాలీవుడ్ లవ్ బర్డ్స్ మలైకా అరోరా, అర్జున్ కపూర్ ప్రేమాయణం కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి మధ్య ఏకంగా 12 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ ఇవన్నీ పట్టించుకోకుండా దేశ విదేశాల్లో జంటగా చెట్టాపట్టాలేసుకుని తిరిగాను. పార్టీలు, పబ్బులు అని తేడా లేకుండా ఫుల్ ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి నెట్టింట రచ్చ చేశారు. ఈ క్రమంలో వీరిద్దరు పెళ్లి కూడా చేసుకుంటారని ఫిక్స్ అయిపోయారు.

కానీ గత కొద్ది కాలంగా ఆ జంట బ్రేకప్ చెప్పుకుని విడిపోయారని వార్తలు జోరందుకున్నాయి. మనస్పర్థలు రావడంతో విడిగా ఉంటున్నారని అంతా చర్చించుకుంటున్నారు. అలాగే ఇటీవల అర్జున్ బర్త్ డేకు కూడా ఈ అమ్మడు విష్ చేయకపోవడంతో రూమర్స్ ఎక్కువై పోయాయి. కానీ దీనిపై మలైకా అరోరా, అర్జున్ కపూర్ మాత్రం అధికారికంగా స్పందించలేదు. తాజాగా, ఈ జంటకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో బ్రేకప్ వార్తలకు బలం చేకూరినట్లైంది. ఢిల్లీలో జరిగిన 2024 ఇండియన్ కోచర్ వీక్ వేడుకల్లో ఈ జంట పాల్గొన్నారు.

కానీ ఇద్దరు ఓకే లైన్‌లో కూర్చున్నప్పటికీ దూరంగా ఉన్నారు. అలాగే ఫంక్షన్ పూర్తి అయ్యాక మలైకా అరోరా బయటకు వెళ్తుండగా.. అర్జున్‌తో కొంతమంది ఫ్యాన్స్ ఫొటోలు తీసుకుంటున్నారు. కానీ ఆమె మాత్రం అతన్ని పట్టించుకోకుండా ముఖం కూడా చూడకుండా బయటకు వెళ్ళిపోయింది. ఇక అర్జున్ కూడా ఫ్యాన్స్ గుమిగూడటంతో వారిని సైడ్‌కు ఉండమని చెప్పాడు కానీ ప్రియురాలి ముఖం చూడలేదు. ప్రజెంట్ దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుండటంతో.. వీరిద్దరి బ్రేకప్ కన్ఫామ్ అని అంతా అనుకుంటున్నారు. అందుకే అలా దూరంగా ఉంటున్నారని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు.


(Video Link Credits to viralbhayani Instagram Channel)

Advertisement

Next Story