అనుష్క లేటెస్ట్ చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వాయిదా!

by samatah |   ( Updated:2023-07-26 07:39:28.0  )
అనుష్క లేటెస్ట్ చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ వాయిదా!
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ అనుష్క చాలా ఏళ్ల తర్వాత ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీతో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది. దర్శకుడు మహేష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్నాడు. ఇక ఇప్పటివరకూ రిలీజ్ అయిన ప్రతి అప్‌డేట్ ఎంతగానో ఆకట్టుకోగా చాలా గ్యాప్ తర్వాత అనుష్క రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఫ్యాన్స్ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మేకర్స్ ఈ చిత్రాన్ని ఆగస్టు 4న రిలీజ్‌కు ప్లాన్ చేయగా అనుకున్న డేట్‌కు రిలీజ్ చేయడం ఇప్పుడు సాధ్యమయ్యేలా లేదని, ఇంకా మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెండింగ్‌లో ఉన్నాయని టాక్ వినిపిస్తుంది. అందుకే రిలీజ్‌కు లేట్ అవుతుందని తెలుస్తోంది.

Read More: ఇక‌పై ఆ ఇండస్ట్రీలో ఇతర భాషల న‌టుల‌కు నో ఛాన్స్.. మారిన రూల్స్‌

Advertisement

Next Story