మూవీ ప్రమోషన్ కు వెళ్లని అనుష్క.. అసలు ఆమెకు ఏమైంది..?

by Shiva |
మూవీ ప్రమోషన్ కు వెళ్లని అనుష్క.. అసలు ఆమెకు ఏమైంది..?
X

దిశ, వెబ్ డెస్క్ : లేడీ ఓరియంటెడ్ మూవీలకు పెట్టింది పేరు కన్నడ ముద్దుగుమ్మ అనుష్క శెట్టి. మాతృ భాష కన్నడ అయినా.. తన అద్భుత నటనతో తెలుగు ప్రేక్షకుల ఆదారాభిమానాలను పొందింది. అరుంధతి తో మహిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె బాహుబలిలో తన నటనతో ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ అభిమానులను సంపాదించుకుంది. బాహుబలి లాంటి పాన్ ఇండియా మూవీ చేశాక తన కెరీర్ అంతా అలాంటి సినిమాలే చేస్తుంది అనుకున్న అనుష్క పూర్తి సైలెంట్ అయిపోయింది.

చాలా రోజులు సినిమాలకు దూరంగా ఉంటూ ఇటీవలే 'మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రమోషన్స్ కి మాత్రం దూరంగా ఉంటోంది. ఎందుకంటే సైజ్ జీరో చిత్ర కోసం అనుష్క గతంలో విపరీతంగా బరువు పెరిగింది. అప్పటి నుంచి అదే లెవెల్ లో ఫిజిక్ మెయింటెయిన్ చేస్తుంది. తాజాగా.. 'మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి'లో కూడా ఈ ముద్దుగుమ్మ బొద్దుగా ఉంది. ఆ కారణంగానే ఆమె మూవీ ప్రమోషన్స్ రావట్లేదని టాక్ వినిపిస్తుంది.

Advertisement

Next Story