అనుష్క శెట్టి చేతుల మీదుగా 'కళ్యాణం కమనీయం' ట్రైలర్ రిలీజ్

by sudharani |   ( Updated:2023-01-05 10:08:42.0  )
అనుష్క శెట్టి చేతుల మీదుగా కళ్యాణం కమనీయం ట్రైలర్ రిలీజ్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న సరికొత్త చిత్రం 'కళ్యాణం కమనీయం'. ఈ మూవీలో కోలీవుడ్ తార ప్రియ భవాని శంకర్ నాయికగా నటిస్తోంది. పెళ్లి నేపథ్యంలో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్న ఈ సినిమాను యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఈ మేరకు చిత్ర ప్రమోషన్ పనులు వేగవంతం చేశారు మేకర్స్. హీరో హీరోయిన్లు కలిసి కొన్ని ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా మేకర్స్ ట్రైలర్‌ను విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈరోజు సాయంత్రం 05:04 నిమిషాలకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేయించనున్నారు. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్ పోస్టర్‌తో అనౌన్స్ చేశారు.

Advertisement

Next Story