పోలీస్ స్టేషన్‌కు అనుష్క శెట్టి.. తల్లిదండ్రులతో కలసి వారిపై ఫిర్యాదు?

by Nagaya |   ( Updated:2024-01-31 12:19:49.0  )
పోలీస్ స్టేషన్‌కు అనుష్క శెట్టి.. తల్లిదండ్రులతో కలసి వారిపై ఫిర్యాదు?
X

దిశ, వెబ్‌డెస్క్: ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాని ఇష్టం వచ్చినట్లు వాడుతున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో మామూలు ప్రజానికమే కాకుండా స్టార్ సెలబ్రిటీలు కూడా పడుతున్నారు. ఫొటోలను మార్ఫింగ్ చేయడం, ఆ పిక్చర్స్ ని సోషల్ మీడియాలో పెట్టడం చేస్తున్నారు. రీసెంట్గా రష్మిక మందన్నా ఈ ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసిన విషయం తెలిసిందే. ఇటీవల టాలీవుడ్ ముద్దుగుమ్మ స్వీటి శెట్టి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి చేసుకున్నట్లు, వారిద్దరికి పిల్లలు పుట్టినట్టు ఫొటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. అయితే ఆ ఫొటోలను అనుష్క శెట్టి లైట్‌గా తీసుకున్నా ఆమె ఫ్యామిలీ ఆ ఫొటోస్ చూసి ‘కడుపు రగిలిపోతుంది.. ఎంతమందితో తన కూతురు పెళ్లి చేస్తారు’ అని పేరెంట్స్ బాధపడిపోతున్నారట.

అంతేకాదు అలాంటి వాళ్ళపై కఠినంగా చర్యలు తీసుకోవాలని, తన కూతురు పర్సనల్ లైఫ్‌పై ట్రోల్ చేసే వాళ్లపై పోలీసు కేసు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ప్రజెంట్ ఇదే న్యూస్ సినీ ఇండస్ట్రీలో వైరల్ అవుతుంది. అయితే ఇన్నాళ్లు చూసి చూడనట్లు వదిలేసిన అనుష్క శెట్టి ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోస్‌పై ఫైర్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే.. నిన్న మొన్నటి వరకు ప్రభాస్‌తో పెళ్లి అంటూ ఫొటోస్ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో రిలీజ్ చేసిన నెటిజన్స్ .. ఇప్పుడు ఓ బడా క్రికెటర్‌తో ఆమె పెళ్లి జరగబోతుందని ఏకంగా ఆయనతో క్లోజ్‌గా ఉన్నట్లు కొన్ని ఫొటోస్‌ని మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో అనుష్క పోలిస్ కేసు పెట్టాలని, అప్పుడే ఇటువంటివి జరగవని నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తుంది.

Advertisement

Next Story