అనుష్క శర్మ-విరాట్ కోహ్లీల బాడీ గార్డ్ జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

by Disha Web Desk 6 |
అనుష్క శర్మ-విరాట్ కోహ్లీల బాడీ గార్డ్ జీతం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
X

దిశ, సినిమా: చాలా మంది సినీ సెలబ్రిటీలు తమ రక్షణ కోసం లక్షల కొద్ది జీతాలు ఇస్తూ బాడీ గార్డ్‌లను మెయిన్‌టేన్ చేస్తుంటారు. కొందరు అప్పుడప్పుడు మారుస్తుంటారు. కానీ మరికొందరు మాత్రం నమ్మకంగా ఉన్నవారినే కుటుంబ సభ్యులుగా భావించి కొన్ని సంవత్సరాల నుంచి వారినే పెట్టుకుంటారు. అయితే ఇటీవల కొందరి సెలబ్రిటీ బాడీగార్డ్‌ల జీతాలు నెట్టింట వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. తాజాగా, క్రికెటర్ విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ దంపతుల బాడీ గార్డ్ జీతంకు సంబంధించిన వివరాలు బయటకు వచ్చాయి.

అతని పేరు ప్రకాష్ సింగ్ అలియాస్ అకా సోను అని తెలుస్తోంది. సోనూ వార్షిక వేతనం రూ. 1.2 కోట్లు అని తెలుస్తోంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. అనుష్క శర్మ పెళ్లి కాకముందు నుంచి అతడినే బాడీ గార్డ్‌గా పెట్టుకున్నట్లు సమాచారం. ఇక వివాహ అనంతరం అతని వృతిపై సోనూకు ఉన్న అంకితభావం గురించి విరాట్‌కు చెప్పడంతో అతను కూడా బాడీ గార్డ్‌గా పెట్టుకున్నట్లు టాక్. అందరికంటే ఎక్కువగా ఈ జంట సోనూనే నమ్ముతారని అందుకే బయటకు ఎక్కడికి వెళ్లినా అతడినే తీసుకెళ్తారట.

Next Story