ఆ హీరోను లవ్ చేస్తున్న అనుపమ.. కానీ ఆ హీరో మాత్రం..

by samatah |   ( Updated:2023-02-16 07:25:53.0  )
ఆ హీరోను లవ్ చేస్తున్న అనుపమ.. కానీ ఆ హీరో మాత్రం..
X

దిశ, వెబ్‌డెస్క్ : ఆ హీరోను లవ్ చేస్తున్న అనుపమ... కానీ ఆ హీరో మాత్రం : మలయాల బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ప్రేమమ్ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ తన నటనతో ఎంతో మంది అభిమానులను కూడగట్టుకుంది. ఇక ఆ తర్వాత ఉన్నది ఒక్కటే జిందగీ, శతమానంభవతి, హాలో గురు ప్రేమకోసమే, కార్తీకేయ, 18 పేజీస్, రాక్షసుడు లాంటి చాలా సినిమాల్లో నటించి సూపర్ హిట్‌లను తన ఖాతాలో వేసుకుంది.

అయితే ఇటీవల కాలంలో ఈ అమ్ముడుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ రూయర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే, అనుపమ ఓ హీరోను లవ్ చేస్తుంది. కానీ ఆ హీరో మాత్రం ఈ అనును అంతగా పట్టించుకోవడం లేదు అని ముచ్చటిస్తున్నారు.

అయితే వాలెంటైన్స్ డే సందర్భంగా అను పెట్టిన పోస్ట్ ప్రస్తుతం ఆమె లవ్‌లో ఉంది అని అర్థమయ్యేలా ఉందంట. ఆమె ఆ పోస్టులో ఏం పెట్టిందంటే.. నేను ఇంకా లవ్ లోనే ఉన్నాను .. సినిమాల్లో వచ్చే ప్రేమ కథలు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది.నేను కూడా ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పుకొచ్చింది. అయితే దీనిపై ఓ నెటిజన్ స్పందిస్తూ నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని అడగగా, పేరు చెప్పలేను కానీ నేను లవ్ లో ఉన్నానంటూ చెప్పుకొచ్చింది.

దీంతో అనుపమ ఎవరితోనో లవ్‌లో ఉంది కానీ ఆ అబ్బాయ పేరు బయటకు చెప్పడానికి ఆసక్తి చూపడం లేదు. లేదా వన్ సైడ్ లవ్ చేస్తుందేమో అంటూ పలు విధాలుగా నెట్టింట్లో గుస గుసలాడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

Samantha : రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సమంత.. ఆ పని చేసి మరి!

Advertisement

Next Story