The India House: 'ది ఇండియా హౌస్'లోకి అనుపమ్ ఖేర్.. వైరల్‌గా మారిన ఫొటోలు

by sudharani |
The India House: ది ఇండియా హౌస్లోకి అనుపమ్ ఖేర్.. వైరల్‌గా మారిన ఫొటోలు
X

దిశ, సినిమా: యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, సాయి మంజ్రేకర్, అనుపమ్ ఖేర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'ది ఇండియా హౌస్‌'. రామ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, విక్రమ్ రెడ్డి V మెగా పిక్చర్స్ ప్రొడక్షన్ పార్ట్నర్స్. 1905 బ్యాక్ డ్రాప్‌లో లవ్, రెవెల్యుషన్ థీం ని ఎక్స్‌ఫ్లోర్ చేసే ఈ పీరియడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం.. ఇటీవల హంపి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్‌లో అఫీషియల్‌గా స్టార్ట్ చేశారు.

ప్రజెంట్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలోకి ప్రముఖ నటుడు అనుపమ్ ఖేర్ భాగం అయ్యాడు. అనుపమ్ ఖేర్ సెట్‌లోకి ఎంట్రీ ఇవ్వడంతో టీమ్‌కు న్యూ డైనమిక్ ఎనర్జీని తీసుకువచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోను మేకర్స్ రిలీజ్ చెయ్యగా.. ఇందులో అభిషేక్ అగర్వాల్, అనుపమ్ ఖేర్ మధ్య అభిమానం చాలా చక్కగా కనిపించింది. ప్రజెంట్ ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed