‘లియో’లో మరో వర్సటైల్ యాక్టర్ ఎంట్రీ.. గ్లింప్స్ రిలీజ్

by Prasanna |   ( Updated:2023-08-16 11:38:31.0  )
‘లియో’లో మరో వర్సటైల్ యాక్టర్ ఎంట్రీ.. గ్లింప్స్ రిలీజ్
X

దిశ, సినిమా: ‘విక్రమ్’ మూవీతో ఓ రేంజ్ లో హిట్ కొట్టిన లోకేష్.. ఇప్పుడు దళపతి విజయ్‌తో ‘లియో’ మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోగా ఈ సినిమాలో చాలా మంది స్టార్లు నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ చిత్రంలో మరో క్యారెక్టర్ పరిచయం చేశారు లోకేష్. సీనియర్ హీరో యాక్షన్ కింగ్ అర్జున్ కూడా నటిస్తున్నట్లుగా చెబుతూ అర్జున్‌కు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు. ‘విక్రమ్’ మూవీ చివరిలో సూర్య ఎంట్రీ ఎలా ఉందో. ఇప్పుడు అర్జున్ ఎంట్రీ కూడా అలానే ఉంది. డ్రగ్స్ మాఫియాకు చెందిన వ్యక్తిగా అర్జున్‌ను చూపించాడు లోకేష్.

Read More : Tamannaah Bhatia : తమన్నా ఆస్తి ఎంత ఉంటుందో తెలుసా?

Advertisement

Next Story