‘గణపథ్’ నుంచి మరో బిగ్ అప్ డేట్.. ఎట్టకేలకు రాబోతున్న టీజర్

by Anjali |
‘గణపథ్’ నుంచి మరో బిగ్ అప్ డేట్.. ఎట్టకేలకు రాబోతున్న టీజర్
X

దిశ, సినిమా: టైగ‌ర్ ష్రాఫ్‌, కృతి సనన్‌ నటించిన నయా మూవీ ‘గణపథ్’ నుంచి మరో అప్ డేట్ వెలువడింది. ఏ హీరో ఈజ్ బార్న్ అనే ట్యాగ్ లైన్‌తో వస్తున్న ఈమూవీని స్పోర్ట్స్ యాక్షన్‌ డ్రామా నేపథ్యంలో వికాస్‌ భల్‌ తెరకెక్కించగా ఈ సినిమా నుంచి మరో అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. మొదట సెప్టెంబర్ 23న టీజ‌ర్‌ విడుదల చేయనున్నట్లు ప్రక‌టించిన విష‌యం తెలిసిందే. కాగా అనుకోని కారణాల వల్ల వాయిదా వేసినట్లు తెలిపిన చిత్ర బృందం.. సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు సోష‌ల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక గుడ్‌ కో, పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై నిర్మితమైన మూవీలో అమితాబ్‌ బచ్చన్‌, రెహమాన్‌, జమీల్‌ ఖాన్‌, గిరీష్‌ కులకర్ణి, శ్రుతి మీనన్‌, జియాద్‌ బక్రీ కీలకపాత్రల్లో నటించగా.. అక్టోబర్‌ 20న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.

Advertisement

Next Story

Most Viewed