నాలుగు అవతారాల్లో రామ్‌చరణ్‌.. ‘గేమ్ చేంజర్’ కోసం భారీ ప్లాన్‌ వేస్తున్న శంకర్

by Prasanna |   ( Updated:2023-10-31 07:43:17.0  )
నాలుగు అవతారాల్లో రామ్‌చరణ్‌.. ‘గేమ్ చేంజర్’ కోసం భారీ ప్లాన్‌ వేస్తున్న శంకర్
X

దిశ, సినిమా: రామ్ చరణ్, శంకర్ కాంబోలో వస్తున్న ‘గేమ్ చేంజర్’నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వైరల్ అవుతోంది. ఈ మేరకు ఒకవైపు దర్శకుడిగా శంకర్‌కు ఉన్న ఇమేజ్, మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చెర్రీ నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు పెరిగిపోయాయి. అయితే సాధారణంగా తన సినిమాల్లో హీరోయిజాన్ని భిన్నంగా చూపించే శంకర్.. ఈ చిత్రంలో రామ్ చరణ్‌ పాత్రను కూడా సరికొత్తగా ఆవిష్కరించేందుకు ప్రయోగాలు చేస్తున్నాడట. అంతేకాదు స్టోరీ డిమాండ్ మేరకు ఇందులో చెర్రీని నాలుగు రకాలుగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ క్యారెక్టర్‌లన్నీ దేనికవే భిన్నమైన రూపాలు కలిగివుంటాయని, వీటిని మూవీ ఫ్లాష్‌బ్యాక్‌‌లో హైలైట్‌గా నిలిపేందుకు భారీ ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. కాగా దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed