బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ కోసం మరో దర్శకుడు సిద్ధం!

by sudharani |   ( Updated:2023-08-09 11:39:48.0  )
బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ కోసం మరో దర్శకుడు సిద్ధం!
X

దిశ, సినిమా: బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ దసరా పండుగ సందర్భంగా అతని తొలి ప్రాజెక్టు ప్రకటన జరగవచ్చని ఇటీవల పుకార్లు వినిపించాయి. అయితే మోక్షజ్ఞ మొదటి చిత్రానికి దర్శకుడిగా బోయపాటి శ్రీను, అనిల్ రావిపూడి, పూరీ జగన్నాథ్‌ ఇలా ప్రముఖ దర్శకుల పేర్లు వినిపించగా.. ఇప్పుడు తాజాగా నాని ‘దసరా’ మూవీ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల మోక్షజ్ఞతో ఓ సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే శ్రీకాంత్ ఓదెల మోక్షజ్ఞకు కథను కూడా వినిపించారని, తండ్రి బాలయ్యతో చర్చలు జరిపారని తెలుస్తోంది. దీని గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Advertisement

Next Story

Most Viewed