- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Animal OTT :ఓటీటీ డేట్ లాక్ చేసుకున్న ‘యానిమల్’
దిశ, సినిమా: ఇటీవల విడుదలై పాన్ ఇండియా లెవల్‌లో భారీ విజయాన్ని అందుకున్న సినిమా ‘యానిమల్’. మన తెలుగు దర్శకుడైన సందీప్ రెడ్డి వంగా.. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్‌తో ఇంత పెద్ద ప్రాజెక్ట్ తెరకెక్కించాడు. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ రూ. 1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టేందుకు చాలా దగ్గర్లో ఉన్నాడు. ఇప్పటికీ థియాట్రికల్ రన్ కొనసాగుతున్న ఈ సినిమాను మిస్ అయితే ఓటీటీలో చూసే అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలోనే మేకర్స్ ఓటీటీ ప్లాట్ ఫామ్, స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.
నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ మూవీ డిజిటల్ రైట్స్ కొనుగోలు చేసిందని సమాచారం. కాగా అయితే మూడు గంటల 23 నిమిషాల రన్ టైమ్‌తో థియేటర్స్‌లోకి వచ్చిన ఈ సినిమాలో కొన్ని సీన్స్ కట్ చేశారు. కానీ కత్తిరించిన సన్నివేశాలను కూడా కలిపి దాదాపు నాలుగు గంటలు మూవీ ఉండబోతుందని టాక్. కాగా ఈ మూవీ స్ర్టీమింగ్ సంక్రాంతి కానుకగా లేదా గణతంత్ర్య దినోత్సవ వేడుకని పురస్కరించుకుని ఓటీటీలో స్ట్రీమ్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం.