- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అన్‌స్టాపబుల్ షోకు ‘యానిమల్’ మూవీ టీమ్.. ఇది కదా బాలయ్య అంటే...!

X
దిశ, సినిమా: ప్రముఖ OTT సంస్థ ఆహాలో ‘అన్‌స్టాపబుల్’ టాక్ షో ద్వారా మొదటిసారి బాలయ్య వ్యాఖ్యాతగా మారిపోయిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటి వరకు రెండు సీజన్స్ గ్రాండ్‌గా ముగించగా.. ఇటీవలే మూడవ సీజన్ కూడా స్టార్ట్ చేశారు మేకర్స్. కాగా మొదటి ఎపిసోడ్‌కు ‘భగవంత్ కేసరి‘ మూవీ టీమ్ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆకట్టుకోగా.. తాజా అప్‌డేట్ ప్రకారం ఈ సీజన్‌లో నెక్స్ట్ ఎపిసోడ్‌కు బాలీవుడ్ ‘యానిమల్’ మూవీ టీమ్ రాబోతున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా నటుడు రణబీర్ కపూర్, రష్మిక మందన్నతోపాటు మూవీ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా సందడి చేయనున్నాడు. కాగా దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. కాగా లిమిటెడ్ ఎడిషన్‌గా చెప్పబడిన ఈ థర్డ్ సీజన్.. జస్ట్ ప్రమోషన్స్‌కే పరిమితం అయిందా అని అనుకుంటున్నారు నెటిజన్లు.
Next Story