యానిమల్ మూవీ హిట్ .. పట్టలేని సంతోషంతో రష్మిక ఏమన్నారంటే..?

by Prasanna |   ( Updated:2023-12-03 05:26:21.0  )
యానిమల్ మూవీ హిట్ .. పట్టలేని సంతోషంతో రష్మిక ఏమన్నారంటే..?
X

దిశ,వెబ్ డెస్క్: సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా, నేషనల్ క్రష్ రష్మీక మందన్న నటించిన యానిమల్ బాలీవుడ్ లో హిట్ టాక్ సొంతం చేసుకుని మంచి వసూళ్లతో దూసుకెళ్తుంది. రష్మీక ఫ్యాన్స్ నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో నేషనల్ క్రష్ సోషల్ మీడియాలో ఒక ఫోటోను షేర్ చేశారు.ఆ ఫోటోలో ఆమె.. అందులో ఆమె ప్రసిద్ధ లిల్లీ పోజ్ (కొరియన్ హార్ట్ పోజ్)ఇవ్వడం కన్పిస్తుంది. ఆమె క్యాప్షన్‌లో ఇలా రాసుకొచ్చారు.. " యానిమల్ సినిమా పట్ల అభిమానులు చూపిస్తున్న ఆదరణ, ప్రేమను ఎప్పటికి మరిచిపోలేనన్నారు.ఈ మూవీ యూనిట్ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని చెప్పారు. అంతేకాకుండా.. ఇలాంటి మూవీలో నటించినందుకు ఎంతో గర్వంగా కూడా ఉందని రష్మిక రాసుకొచ్చారు. ప్రతి ఒక్కరు తమ దగ్గరలోని థియేటర్ లో యానిమల్ సినిమా చూసి ఎంజాయ్ చేయాలని అన్నారు. ప్రస్తుతం యానిమల్ మూవీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.రష్మీక కెరియర్ లో ఇదో గొప్ప మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. యానిమల్ మూవీపై ఆలియాభట్ కూడా స్పందించారు. సోషల్ మీడియాలో పెద్ద నోట్ రాసుకొచ్చారు. యానిమల్ సినిమాలో రష్మిక నటన అద్భుతమని అన్నారు. నిజాయితీతో కూడిన ఆమె రోల్ పై ఆలియా ప్రశంసల వర్షం కురిపించారు.

Advertisement

Next Story