ఆ స్టార్ డైరెక్టర్ ఇంటికి వెళ్లి కన్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక చోప్రా కారణమేంటో తెలుసా..?

by Prasanna |   ( Updated:2023-09-29 12:31:24.0  )
ఆ స్టార్ డైరెక్టర్ ఇంటికి వెళ్లి  కన్నీళ్లు పెట్టుకున్న ప్రియాంక చోప్రా కారణమేంటో తెలుసా..?
X

దిశ, సినిమా: ముక్కు సర్జరీ కారణంగా ప్రియాంక చోప్రా ఊహించని ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు దర్శకుడు అనిల్ శర్మ తెలిపాడు. ఈ మేరకు ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన.. నోస్ సర్జరీ ఎఫెక్ట్‌తో ప్రియాంకను చాలా సినిమాల నుంచి తొలగించారని, ఒక సమయంలో ఆమె సినిమాలకు స్వస్తి చెప్పే దశకు చేరుకుందన్నాడు. ‘ముక్కుకు శస్త్ర చికిత్స అనుకున్నట్లు జరగలేదు. దీంతో భయంకరమైన ఫేస్ చూసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. కొన్ని నెలలపాటు డిప్రెషన్‌లోకి వెళ్లింది. ఈ విషయం నేను పేపర్లలో వచ్చిన వార్తల ద్వారా తెలుసుకుని.. చాలా అందమైన అమ్మాయి ఇలాంటి పని ఎందుకు చేసిందని ఆశ్చర్యపోయా. వెంటనే ఆమెకు ఫోన్ చేసాను. మరుసటి రోజే తన తల్లితో కలిసి వచ్చింది. ఇద్దరూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ ఆపరేషన్ గురించి చెబుతూ తీరని నష్టం జరిగిందని ఆవేదన చెందారు’ అంటూ చెప్పుకొచ్చాడు అనిల్. అయితే రెండు నెలల సమయం తర్వాత తానే స్వయంగా ఆమెకు సినిమా ఆఫర్ ఇచ్చి కెరీర్‌ కాపాడానని తెలిపాడు.

Advertisement

Next Story

Most Viewed