‘మీటర్’ నుంచి సెకండ్ సింగిల్.. ‘ఓ బేబీ’ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి

by sudharani |   ( Updated:2023-12-16 18:15:51.0  )
‘మీటర్’ నుంచి సెకండ్ సింగిల్.. ‘ఓ బేబీ’ రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి
X

దిశ, సినిమా: ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో కిరణ్ అబ్బవరం హీరోగా వస్తున్న సినిమా ‘మీటర్’. రమేష్ కడూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. కాగా సినిమా నుంచి ఇటీవల విడుదలైన టీజర్‌, ఫస్ట్ సింగిల్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుండగా.. తాజాగా అనిల్ రావిపూడి చేతులమీదుగా ‘ఓ బేబీ’ అనే సెకండ్ సింగిల్ లిరికల్ వీడియోను రిలీజ్ చేయించారు మేకర్స్. బాలాజీ సాహిత్యం అందించిన పాటను సాయి కార్తిక్ సంగీత సారథ్యంలో థనుంజయ అద్భుతంగా ఆలపించాడు. ఇక పాటలో కిరణ్ డ్యాన్స్ మూమెంట్స్‌ అభిమానులను అట్రాక్ట్ చేస్తుండగా.. ఏప్రిల్ 7న విడుదలకానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుటుందన్నారు దర్శకనిర్మాతలు.

Advertisement

Next Story