- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Srimukhi : ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంటున్న శ్రీముఖి.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్!

దిశ, సినిమా : యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. పటాస్ షో ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది ఈ బ్యూటీ. ఓవైపు యాంకరింగ్, మరో వైపు సినిమాల్లో కూడా నటిస్తూ.. తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక శ్రీముఖికి సంబంధించిన ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరీ ముఖ్యంగా శ్రీముఖి పెళ్లి వార్తల గురించి అనేక పుకార్లు వస్తుంటాయి. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం వాటి గురించి అంతగా పట్టించుకోకుండా, తన కెరీర్ పై ఫోకస్ చేసి, ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది.
ఇక ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన హాట్ అండ్ క్యూట్ ఫోటోస్ షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఈ చిన్నది లంగాఓణీలో తళుక్కుమంది. బ్లూ అండ్ వైట్ హాఫ్ శారీలో ఈ ముద్దుగుమ్మ చాలా అందంగా కనిపిస్తుంది. చెవులకు పెద్ద ఝుమ్కీలతో ట్రెడిషనల్ లుక్‌లో ఆకట్టుకుంటుంది. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ శ్రీముఖి చాలా పద్ధతిగా ఉంది, బ్యూటిపుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.