బెంగళూరు రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల.. హాట్ టాపిక్‌గా మారిన వైనం.. క్లారిటీ ఇదే!

by Hamsa |   ( Updated:2024-05-22 12:01:44.0  )
బెంగళూరు రేవ్ పార్టీలో యాంకర్ శ్యామల.. హాట్ టాపిక్‌గా మారిన వైనం.. క్లారిటీ ఇదే!
X

దిశ, సినిమా: గత రెండు రోజుల నుంచి బెంగళూరు రేవ్ పార్టీ ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. ఇందులో ఏకంగా 100 మంది సినీ సెలబ్రిటీలు ఉన్నట్లు కన్నడ పోలీసులు బయటపెట్టడంతో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అయితే ఇందులో పలువురు టాలీవుడ్‌ సెలబ్రిటీలు ఉన్నాట్లు వార్తలు కూడా వచ్చిన విషయం తెలిసిందే. అలాంటి వార్తలపై శ్రీకాంత్, జానీ మాస్టర్ వంటి వారు తాము పాల్గొనలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ క్రమంలో ఓ యాంకర్ వైసీపీ పార్టీ నేత కారులో ఉందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో ఆ కారును కూడా సీజ్ చేసినట్లు తెలియడంతో ఈ విషయం కాస్త నెట్టింట హట్ టాపిక్‌గా మారింది.

అతని కారులో ఉంది ఎవరో కాదు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యాంకర్ శ్యామల అని ప్రచారం జోరందుకుంది. అలాగే కొందరు నెటిజన్లు శ్యామలపై దారుణమైన కామెంట్లు చేశారు. తాజాగా, ఈ విషయంపై యాంకర్ శ్యామల స్పందించి క్లారిటీ ఇస్తూ అసలు నిజాలు బయటపెట్టింది. ‘‘ అసలు ఆ రేవ్ పార్టీ అంటే ఏంటో కూడా నాకు తెలియదు. బెంగళూరులో ఎప్పుడు ఎక్కడ జరిగింది. ఎందుకు జరిగింది అందులో ఎవరెవరు ఉన్నారో నాకు అసలు ఏమీ తెలియదు. ఎందుకు నన్ను కొందరు అనవసరంగా ఈ విషయంలోకి లాగుతూ ప్రచారం చేస్తున్నారు. దుష్ప్రచారం చేసి నా పేరును చెడగొడుతున్నారు.

ఇంత దిగజారిని రాజకీయాలు చేస్తున్నారు అంటే.. ఒక పార్టీకి నేను సపోర్ట్ చేశాను అని ఇలా నాపై దుష్ప్రచారం చేస్తున్నారు న్యాయమేనా? దయచేసి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మకండి. అసలు ఆ రేవ్ పార్టీకి నాకు ఎలాంటి సంబంధం లేదు. కొందరు కావాలనే ఇలా చేస్తూ నన్ను బాధపెడుతున్నారు. ఇక నుంచి అయినా ఇలాంటివి చేయడం మానేయండి. నా మీద బురదజల్లే వాళ్ల మీద న్యాయపరమైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ల మీద పరువు నష్టం దావా వేయడం జరిగింది అని యాంకర్ శ్యామల హెచ్చరించింది. జర్నలిస్టులు నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే వాళ్ళు అయి ఉండాలి. అంతేగాని ఇలా అసత్య ప్రచారాలు చేసే వాళ్ళు కాదు. దయచేసి మీ అసత్య ప్రచారాలతో జర్నలిజం విలువలు తగ్గించవద్దు’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం యాంకర్ శ్యామల కామెంట్స్ వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలిసినన వారు కొందరు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.

Read More..

బిగ్‌బాస్ బ్యూటీకి చేదు అనుభవం.. ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానంటూ ఎమోషనల్ పోస్ట్

Advertisement

Next Story