Rashmi Gautam : పెళ్లికి రెడీ అయిన రష్మీ.. నెట్టింట ఫొటో షూట్ వైరల్

by sudharani |   ( Updated:2024-04-21 14:19:00.0  )
Rashmi Gautam : పెళ్లికి రెడీ అయిన రష్మీ.. నెట్టింట ఫొటో షూట్ వైరల్
X

దిశ, సినిమా: బుల్లితెరపై యాంకర్‌గా ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న వారిలో రష్మీ గౌతమ్ ఒకరు. జబర్ధస్త్ ద్వారా మరింత పాపులారిటీ తెచ్చుకున్న ఈ బ్యూటీ.. వెండితెరపై కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి తన అదృష్టాన్ని పరీక్షించుకునే ప్రయత్నం చేసింది. సైడ్ యాక్టర్‌గా, హీరోయిన్‌గా పలు సినిమాలు తీసినప్పటికీ వెండితెరపై అనుకున్నంత సక్సెస్ అందుకోలే పోయింది ఈ అమ్మడు. ప్రస్తుతం మళ్లీ బుల్లితెరపై ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ.. పలు షోలు చేస్తూ సందడి చేస్తుంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే రష్మీ అక్కడ కూడా తన అందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ.. ట్రెండీ ఫొటో షూట్‌లతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఈ మధ్య కాలంలో గ్లామర్ డోస్ మరింత పెంచి అందాల విందు ఏర్పాటు చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా బ్లాక్‌ కలర్ శారీలో ఫోటోలను పంచుకుంటుంది రష్మీ. పలుచని బ్లాక్ శారీలో కనిపించి కనిపంచనట్టు సొగసును చూపిస్తున్న ఈ అమ్మడు ఫొటోస్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా.. మైండ్‌ బ్లాక్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. అంతే కాకుండా.. గతంలో కంటే కాస్త స్లిమ్ అవ్వడంతో.. రష్మీ పెళ్లి చేసుకోబోతుందని, మ్యారేజ్‌ కోసమే ఆమె స్లిమ్‌ అయ్యిందంటూ మరికొందరూ రిప్లైలు ఇస్తున్నారు.

Read More...

Samantha Ruth Prabhu : సమంత ధరించిన ఆ మెలికల వాచ్ ధర ఎంతో తెలుసా..?

Advertisement

Next Story