నందుపై షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రష్మి.. వాష్ రూమ్ కెమెరాలు అంటూ..

by sudharani |   ( Updated:2022-10-21 16:29:44.0  )
నందుపై షాకింగ్ కామెంట్స్ చేసిన యాంకర్ రష్మి.. వాష్ రూమ్ కెమెరాలు అంటూ..
X

దిశ, సినిమా : యంగ్ హీరో నందు‌, యాంకర్ ర‌ష్మీ గౌత‌మ్ హీరోహీరోయిన్లుగా, నూతన దర్శకుడు రాజ్ విరాఠ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'బొమ్మ బ్లాక్ బస్టర్'. కామెడీ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో నందు 'పోతురాజు' పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే రీసెంట్‌గా నందుపై ఫుల్ ఫైర్ అయింది రష్మి. ఈ మూవీ చాలా గ్యాప్ తర్వాత నవంబర్ 4న రిలీజ్‌కు రెడీ కావడంతో.. ప్రమోషన్స్‌పై దృష్టిపెట్టింది మూవీ యూనిట్. కానీ రష్మీ ప్రమోషన్స్‌కి రావడంలేదు అంటూ హీరో నందు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. 'రష్మీ సినిమా ప్రమోషన్స్‌కి రావడం లేదు. మేము ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయడం లేదు. పొగరు చూపిస్తుంది. అందుకే ఆమె ఫొటోషూట్‌లో పాల్గొంటున్న ప్లేస్‌కి వచ్చాం' అంటూ రష్మీని కలిసి ఎందుకు ప్రమోషన్స్‌కు అటెండ్ కావట్లేదంటూ ప్రశ్నించాడు.

దీంతో కోపం వచ్చిన రష్మి.. 'సినిమా గురించి చాలా ప్రశ్నలు అడుగుతారు. వాటికి నేను ఆన్సర్ చేయలేను. అందుకే రావడం లేదు' అంటూ సమాధానం చెప్పింది. ఆ తర్వాత ఇదంతా ఫ్రాంక్ అంటూ నందు వీడియోను క్లోజ్ చేయగా.. రీసెంట్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మి 'వాళ్లు ఫ్రాంక్ చేశారేమో కానీ. ఇది నిజంగా ఫ్రాంక్ కాదు. నేను నిజంగానే ఆ మాటలు అన్నాను. సడెన్‌గా పిలిస్తే ప్రమోషన్‌కు ఎలా వస్తారు. నా షెడ్యూల్ చూసుకోవాలి కదా..? నేను వేరే షెడ్యూల్‌లో ఉంటే వచ్చి విసిగిస్తే ఎలా? చాన్స్ ఉంటే నా వాష్‌రూమ్‌లో కూడా కెమెరాలు పెట్టేలా ఉన్నారు' అంటూ రష్మి సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇవి కూడా చదవండి :

ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నింపుతుంది.. హ్యూమా

Advertisement

Next Story