లైవ్‌లో బోరున విలపించిన హాట్ యాంకర్ అనసూయ.. ఎందుకంటే? (వీడియో)

by sudharani |   ( Updated:2023-08-25 04:58:42.0  )
లైవ్‌లో బోరున విలపించిన హాట్ యాంకర్ అనసూయ.. ఎందుకంటే? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: యాంకర్‌గా బుల్లితెరపై అడుగుపెట్టి.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న అమ్మడు అనసూయ. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఈ బ్యూటీ.. నెట్టింట అనేక ట్రోల్స్ ఎదుర్కొంటుంది. అయినప్పటికీ తనపై వచ్చే విమర్శలు ఏమాత్రం పట్టించుకోకుండా తన లైఫ్ స్టైల్‌లో తాను హ్యాపీగా గడిపేస్తున్న అనసూయ.. తాజాగా భావోద్వేగానికి గురైంది. ఏమైందో తెలియదు కానీ.. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ వీడియో షేర్ చేసింది. ఈ మేరకు కంటతడి పెట్టుకుంటూ.. ‘‘మానసికంగా కుంగిపోయాను. నేను అందరితో అన్ని విషయాలు పంచుకుంటా. భావోద్వేగాన్ని కూడా అందరితో పంచుకుంటా. అన్ని రోజులు ఒకేలా ఉండవు. ఇతరులతో దయతో ఉండండి’’ అంటూ భావోద్వేగానికి గురైంది. అయితే.. ఐదురోజుల క్రితం రికర్డు చేసిన వీడియోను ఇవాళ పోస్ట్ చేసిన అనసూయ.. ఇప్పుడు బాగానే ఉన్నట్లు తెలిపింది.

Advertisement

Next Story