- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అది బూతు కాదా.. ఆ హీరోల సినిమాలపై మండిపడిన అనసూయ!
దిశ, సినిమా : యాంకర్ అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఆమె సొంతం. జబర్దస్త్ షో ద్వారా ఈ బ్యూటీ మంచి ఫేమ్ సంపాదించుకుంది. ప్రస్తుతం సినిమాల్లో విలక్షణ పాత్రల్లో నటిస్తూ మంచి క్రేజ్ సొంతం చేసుకుంటుంది. అనసూయ నటనకు ఎంతో మంది ఫిదా అయిపోతున్నారు. అయితే తాజాగా ఈ నటికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
జబర్దస్త్‌లో ఉన్నప్పుడు అనసూయ చాలా విమర్శలు ఎదుర్కొంది. పొట్టి, పొట్టి దుస్తులు వేసుకోవడంతో ఆమెపై పలువురు విమర్శలు చేశారు. అంతేకాకుండా డబుల్ మీనింగ్ జోక్స్ వేస్తూ చాలా ఇబ్బందులు పెట్టారు. కానీ అనసూయ మాత్రం వాటన్నింటిని పట్టించుకోకుండా, తనకు నచ్చిన దుస్తులను వేసుకుంటూ.. ఎక్స్పోజింగ్ చేస్తూ ఉండేది. అయితే ఓ ఇంటర్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ దీనిపై ఓసారి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
తన గ్లామర్ డ్రెస్సింగ్, డబుల్ మీనింగ్ డైలాగ్స్ గురించి మాట్లాడుతూ.. 80,90లో వచ్చిన సినిమాల సాహిత్యం ఏమిటి? చాలా మంది జబర్దస్త్ షోలో బాడీ షేమింగ్ చేస్తూ మహిళలను కించపరుస్తున్నారని విమర్శలు చేస్తున్నారే, కానీ పాత సినిమాల్లో సాంగ్స్ లిరిక్స్ ఎప్పుడైనా విన్నారా? అవి చాలా పచ్చిగా ఉంటాయి. కానీ అప్పటి మీడియా ఇలా లేదు. ఇప్పుడు అంతా మారిపోయింది. షో ద్వారా అడల్ట్ జోక్స్ ఎంకరేజ్ చేసేందుకు నాకు బాధగా అనిపిస్తుంది. కానీ నా కెరీర్ కోసం ఒకటి కావాలంటే ఒకటి వదులుకోక తప్పదు అంటూ తెలిపింది. అప్పుడు ఆమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
Read More..
ఎందుకో గానీ ఆఫర్లు రావడం లేదు.. ఆ విషయం తెలియకే నష్టపోయానంటున్న నటి!