అనే వాళ్లు ఎన్నైనా అంటారంటూ.. తన పుట్టుకపై అనసూయ ఆసక్తికర ట్వీట్

by Hamsa |   ( Updated:2023-10-14 06:05:08.0  )
అనే వాళ్లు ఎన్నైనా అంటారంటూ.. తన పుట్టుకపై అనసూయ ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాంకర్ అనసూయ జబర్థస్త్ షోతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత వెండితెరపై పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీతో పాపులారిటీ వచ్చింది. అనసూయ ఇక పూర్తిగా బుల్లితెరకు దూరమై ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. ఇటీవల ఆమె నటించిన ‘ప్రేమ విమానం’ మూవీ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ పలు పోస్టులతో అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

తాజాగా, ఓ నెటిజన్ ప్రేమ విమానం మూవీలో పెర్ఫార్మన్స్ అద్భుతం తెలంగాణ మాండలికం ఓన్ చేసుకుని చక్కగా నటించారని ప్రశంసించాడు. దానికి ఆమె నేను ఇక్కడి దాన్నే కదా అందుకే ఓన్ చేసుకున్నాను అని చెప్పింది. మరో నెటిజన్ మీది తుని కదా? అని అడిగాడు. ఈ పోస్ట్‌కు అనసూయ స్పందిస్తూ.. ‘‘ అనుకునే వాళ్ళు ఎన్నైనా అనుకుంటారండి.. కానీ నిజం అనేది ఒక్కటే ఉంటుంది కదా. నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను.. చదువుకున్నాను’’ అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం అనసూయ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారడంతో అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అలాగే ఆమె ఆంధ్రా మాండలికం మాట్లాడుతుందని కుటుంబ మూలాలు ఆంధ్రాలా ఉన్నాయని జనాలు చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story