- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విమర్శలకు, వివాదాలకు తగ్గేదేలేదంటున్న హాట్ యాంకర్ అనసూయ.. ఆమె సోషల్ మీడియా సెన్సేషన్..
దిశ,సినిమా: అనసూయ భరద్వాజ్ క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా చేస్తు ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం అనసూయ ఒక్క తెలుగులోనే కాదు తమిళం, కన్నడలోనూ ఆఫర్స్ అందుకుంటుంది. ఇక తెలుగులో పాన్ ఇండియా మూవీ 'పుష్ప 2' మూవీతో బిజీగా ఉంది. అలాగే పలు చిత్రాల్లో కీలక పాత్రలు చేస్తుంది. అయితే తాను పెట్టే పోస్టుల వల్ల తరచు ట్రోలింగ్ కి గురవుతుంది. నిత్యం పెళ్ళైంది కదా భర్త పిల్లలతో చక్కగా ఉండకుండా ఈ ఎక్సపోజింగ్ ఏంటి .. ఈ వయసులో నీకు అవసరమా అంటూ విమర్శిస్తుంటారు. తన హేటర్స్ కి ఎప్పటికప్పుడు గట్టిగానే బుద్ధి చెప్తుంది అనసూయ. అలాగే అనసూయ ఆడవారికి అన్యాయం జరిగితే ఊరుకోదు కచ్చితంగా ప్రశ్నిస్తారు.
ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, అనసూయ మధ్య ట్వీట్ల వార్ గురించి తెలిసిందే. విజయ్ను విమర్శిస్తూ పరోక్షంగా అనసూయ ట్వీట్స్ చేస్తుండేది. దీంతో ఈ రౌడీ హీరో ఫ్యాన్స్ ఆమెను టార్గెట్ చేస్తూ ట్రోల్ చేశారు. అర్జున్ రెడ్డి లో ఆడవాళ్లను తక్కువగా చేసి చూపించిన విజయ్ పాత్రపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసింది. దీంతో అప్పటి నుంచి సందర్భంగా వచ్చినప్పుడల్లా విజయ్ పై పరోక్షంగా ట్వీట్ వదిలేది. లైగర్ మూవీ టైంలోనూ ది విజయ్ దేవరకొండ అంటూ తన పేరు పక్కన ది వాడటంపై అనసూయ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై కూడా విజయ్ ఫ్యాన్స్ అనసూయతో ట్వీట్ వార్ కు దిగారు. అప్పట్లో ఈ అంశం సోషల్ మీడియాలో ఫుల్ రచ్చ లేపింది. కానీ తగ్గేదే లే అంటూ దానికి బదులుగా తనదైన శైలిలో ఇచ్చిపడేసింది ఈ భామ.