- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Anasuya- Chinmayi: చిన్మయికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన అనసూయ.. పిల్లలతో అలా చేయడం ఎంటర్టైన్మెంట్ అంటూ
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కూడా ఈమె మంచి ఫేమ్ సంపాదించుకున్నది. ముఖ్యంగా హీరోయిన్ సమంతకు ఈమె డబ్బింగ్ చెప్పడం వల్లనే ఆమె స్టార్ హీరోయిన్‌గా మారిందనడంలో ఏమాత్రం అతిశేయోక్తి లేదు. అలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ నిత్యం పలు పోస్టులతో వార్తల్లో నిలుస్తుంది. ఈ క్రమంలోనే అత్యాచారాలు, లైంగిక వేధింపులు గురించి స్పందిస్తుంటుంది.
ఇదిలా ఉంటే ఇటీవల అనసూయ ఓ షోలో చిన్న పిల్లలతో లిప్ లాక్ పెట్టించుకున్న వీడియో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై చిన్మయి స్పందిస్తూ.. “అసలు చిన్న పిల్లలతో ముద్దులు పెట్టించుకోవడం ఏంటి? ఇలా ముద్దులు పెట్టించుకోవటం వినోదమా? పైగా అక్కడున్న వారందరూ చప్పట్లు కొడుతున్నారు. పిల్లల ద్వారా ఇలాంటివి చేయడం వారిపై తీవ్ర మైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయంటూ ఇన్‌డైరెక్ట్‌గా అనసూయపై చిన్మయి మండిపడ్డారు.
అయితే తాజాగా ఈ ఇష్యూపై అనసూయ సైతం రియాక్ట్ అయ్యారు. ఆమె స్పందిస్తూ.. “చిన్నపిల్లలతో ఇలాంటి షోలు చేయడం ఎంటర్టైన్మెంట్ అని కొందరు భావిస్తారు, మరికొందరు భావించరు. ఎవరి ఇష్టం వారిది కానీ నేను కూడా నా అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను. అయినా పిల్లలకు ఇలాంటి షోలు ఎవరు చూపించమన్నారు. వారికోసం కార్టూన్ ఛానల్ ఉన్నాయి కదా వాటిని చూపించొచ్చు” అంటూ చిన్మయికి అనసూయ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.