RGV ని ఫాలో అవుతున్న అనసూయ..! పబ్లిసిటీ కోసమే ఈ వీడియోస్..

by sudharani |   ( Updated:2023-10-31 09:09:21.0  )
RGV ని ఫాలో అవుతున్న అనసూయ..! పబ్లిసిటీ కోసమే ఈ వీడియోస్..
X

దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రాస్‌గా నిలిచేది ఆర్‌జీవి. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే ఆయన.. రాజకీయాలపై, సినిమాలపై కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తాడు. ప్రస్తుతం ఆయన బాటలోనే అనసూయ నడుస్తున్నట్లు తెలుస్తోంది. బుల్లితెర యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. అంతే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని నెట్టింట పోస్ట్ చేస్తూ ఒక్కోసారి విమర్శలు సైతం ఎదుర్కొంటోంది. ఏ విషయాన్ని అయిన కాంట్రవర్సీ అయ్యే వరకు లాగి వార్తల్లో నిలుస్తోంది. తనపై వచ్చిన విమర్శలకు, నెగిటివ్ కామెంట్లకు తనదైన స్టైల్లో రిప్లై ఇస్తూ.. సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంది.

ఇక తాజాగా.. సావిత్రి, జమున, శ్రీదేవి, సౌందర్య వేషధారణతో కనిపించి ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. దీనికి ప్రశంసలు వచ్చినప్పటికీ మరుకొందరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ పెట్టారు. వాటిని తిప్పి కొట్టే క్రమంలో ‘ఎక్స్‌పోజ్ చేసినంత తేలిక కాదు సావిత్రిలా నటించడమంటే. అలాగే ఎక్స్‌పోజింగ్ చేయడం కూడా తేలిక కాదు. శారీరకంగా మానసికంగా చాలా ప్రిపేర్ అవ్వాలి’ అంటూ విమర్శకులకు కౌంటర్ ఇచ్చింది. దీంతో ‘కావాలనే అనసూయ ఇలాంటి వీడియోలు పెడుతోంది. ఆమెకు కాంట్రవర్సీ కావాలి. సోషల్ మీడియాలో ఎక్కువ కామెంట్స్ వచ్చేలా, పబ్లిసిటీ రావడం కోసం ఏదో ఒకటి పెడుతూనే ఉంటుంది. ఆర్జీవీ కూడా ఇలాగే వివాదన్ని సృష్టించి పబ్లిసిటీ చేసుకుంటాడు.. నువ్వు కూడా ఆయన్నే ఫాలో అవుతున్నావ్’ అంటూ మరో సారి రచ్చ చేస్తున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story

Most Viewed