Anasuya Bhardwaj: పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి తెగ ఎంజాయ్ చేసిన అనసూయ.. ఇదిగో సాక్ష్యం!

by Javid Pasha |
Anasuya Bhardwaj: పెళ్లికి ముందే ప్రియుడితో కలిసి  తెగ ఎంజాయ్ చేసిన అనసూయ.. ఇదిగో సాక్ష్యం!
X

దిశ, సినిమా: ఒకప్పటి జబర్దస్త్ యాంకర్, ప్రస్తుత నటి అనసూయ భరద్వాజ్ గురించి పరిచయం అవసరం లేదు. తన నటన, అందం, అభినయంతో స్మాల్‌స్ర్కీన్‌‌కే గ్లామర్ యాంగిల్‌ను పరిచయం చేసిన ట్రెండ్ సెట్టర్‌ ఆమె. 2013లో జబర్దస్త్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ షోకే ఆకర్షణగా నిలిచింది. పొట్టి దుస్తుల్లో దర్శనమిస్తూ కుర్రాళ్లను కట్టిపడేసేది. ఆమె డ్రెస్సింగ్‌పై అనేక విమర్శలు వచ్చినప్పటికీ పట్టించుకునేది కాదు, పైగా విమర్శలకు దీటుగా కౌంటర్ ఇచ్చేది. ఇలా తనకంటూ ప్రత్యేక ఫేమ్ సంపాదించుకున్న అనసూయ 2022లో జబర్దస్త్‌కు గుడ్‌ బై చెప్పి నటిగా బిజీ అయిపోయింది.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనసూయ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించి విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. రీసెంట్‌గా ఆమె తన పెళ్లికి ముందు ప్రియుడితో కలిసి తిరిగిన ఫొటోలను షేర్ చేయగా, నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ‘పెళ్లికి ముందు అనసూయ ఇలా ఉండేదా?’ అంటూ కొందరు. ‘పెళ్లికి ముందే ప్రియుడితో తెగ ఎంజాయ్ చేసింది’ అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ట్విస్ట్ ఏంటంటే.. పెళ్లికి ముందు అనసూయతో కలిసి ఎంజాయ్ చేసిన ఆమె ప్రియుడు మరెవరో కాదు, ప్రస్తుతం ఆమె భర్త అయిన సుశాంక్ భరద్వాజ్. వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. సో.. పెళ్లికి ముందునాటి కొన్ని స్వీట్ మెమోరీస్‌ను అనసూయ తన ఇన్‌స్టా వేదికగా పంచుకుంటూ నాటి ఫొటోలు కూడా షేర్ చేసింది.

Advertisement

Next Story

Most Viewed