Ananya Pande :: వర్షాన్ని లెక్కచేయకుండా బాయ్‌ఫ్రెండ్‌తో డేట్‌కు వెళ్లి కారులో అడ్డంగా బుక్!

by Hamsa |   ( Updated:2023-07-24 06:22:22.0  )
Ananya Pande :: వర్షాన్ని లెక్కచేయకుండా బాయ్‌ఫ్రెండ్‌తో డేట్‌కు వెళ్లి  కారులో అడ్డంగా బుక్!
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘లైగర్’ డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం అనన్య హిందీలో పలు చిత్రాల్లో నటిస్తోంది. అయితే ఈమె నటుడు ఆదిత్య రాయ్ కపూర్‌తో డేటింగ్ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ బ్రిడ్జిపై వీరిద్దరూ హగ్ చేసుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వీటిపై ఈ కపుల్ స్పందించలేదు.

తాజాగా, మరోసారి అనన్య, ఆదిత్య శనివారం డిన్నర్ డేట్‌కు వెళ్లినట్లు సమాచారం. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా వీరిద్దరూ కలిసి కారులో షికారుకు వెళ్లారు. ప్రియుడు కారు నడుపుతుండగా పక్కనే కూర్చొని ఉంది. అది చూసిన మీడియా వీరి ఫొటోను కెమెరాలో బంధించారు. దీంతో అనన్య ముఖాన్ని దాచేందుకు ప్రయత్నించింది. ప్రస్తుతం వీరిద్దరూ కారులో తిరుగుతున్న ఫొటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

ఇవి కూడా చదవండి :: తెలుగు కల్చర్, ప్రేక్షకుల బిహేవియర్‌పై నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. మధ్యతరగతి అమ్మాయినే అంటూ



Advertisement

Next Story