బాయ్ ఫ్రెండ్‌తో ఆ పనిచేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటా.. Ananya Panday

by samatah |   ( Updated:2023-08-17 08:07:36.0  )
బాయ్ ఫ్రెండ్‌తో ఆ పనిచేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటా.. Ananya Panday
X

దిశ, సినిమా : బాలీవుడ్ నటుడు, బాయ్‌ఫ్రెండ్ ఆదిత్య రాయ్ కపూర్‌తో కలిసి పని చేయడం చాలా సరదాగా ఉంటుందని చెప్తోంది అనన్య పాండే. కొంతకాలంగా ఈ జంట డేటింగ్‌లో ఉన్నట్లు పుకార్లు వినిపించగా ఇటీవలే వాటిని నిజం చేస్తూ విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను నెట్టింట షేర్ చేసి తమ రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చేశారు. అయితే ‘డ్రీమ్ గర్ల్ 2’ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ సమావేశంలో పాల్గొన్న అనన్యను ఆదిత్యతో వర్క్, పెళ్లి తదితర ప్రశ్నలడిగారు హోస్ట్. దీంతో మొహమాటం లేకుండా స్పందించిన ఆమె.. ‘ఆదిత్యతో ఎప్పుడు పనిచేస్తానో తెలియదు. బట్ అతనితో వర్క్‌ను ఎంజాయ్ చేస్తా. మంచి స్క్రిప్ట్ దొరికితే త్వరలోనే జంటగా మీ ముందుకొస్తాం. ఇంతకు ముందు కార్తీక్‌తో నటించిన సినిమాకు సీక్వెల్‌గా ‘పతి పత్నీ ఔర్ వో 2’ లేదా అలాంటిదే చేస్తాం’ అని చెప్పింది. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ తానింకా చిన్నపిల్లనేనని, త్వరలో అయితే కాదు కానీ ఏదో ఒక రోజు మాత్రం తప్పకుండా మ్యారేజ్ చేసుకోవాలనుందని స్పష్టం చేసింది.

Advertisement

Next Story

Most Viewed