- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Ananya Nagalla: 'పొట్టేల్' మూవీ నుంచి హీరోయిన్ పోస్టర్ రిలీజ్.. నేచురల్‌గా ఆకట్టుకుంటున్న బ్యూటీ
దిశ, సినిమా: యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల జంటగా నటిస్తున్న చిత్రం 'పొట్టేల్'. రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కతున్న ఈ చిత్రానికి సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నుంచి ఇప్పటివరకు విడుదలైన కంటెంట్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ క్రమంలోనే నేడు అనన్య నాగళ్ల పుట్టిన రోజు కావడంతో.. ఆమెకు బర్త్ డే విశెష్ చెబుతూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌లో అనన్య రూరల్ ట్రెడిషనల్ లుక్‌లో చాలా నేచురల్‌గా కనిపించింది.
అంతే కాకుండా ఈ మూవీలో ఆమె పెర్ఫార్మెన్స్‌కి స్కోప్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుండగా.. ఈ సినిమాతో ఆమెకు టాలీవుడ్‌లో క్రేజ్ పెరుగుతుందని టాక్. ఇక ‘పొట్టేల్’ లో అనన్య బుజ్జమ్మగా అలరించనుండగా.. అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు నటిస్తున్నారు. నిశాంక్ రెడ్డి కుడితి, సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్న ఈ మూవీని త్వరలోనే థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.