అనంత్ అంబానీ వాచ్ ధర 63కోట్లు.. దాని స్పెషల్ ఏంటో తెలుసా?

by Jakkula Samataha |   ( Updated:2024-03-05 15:20:22.0  )
అనంత్ అంబానీ వాచ్ ధర 63కోట్లు.. దాని స్పెషల్ ఏంటో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : అంగరంగ వైభవంగా అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే, అనంత్ అంబానీ, రాధిక మార్చంట్‌కు సంబంధించిన అనేక వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, అనంత్ అంబానీ వాచ్ గురించే చర్చజరుగుతోంది. ఫ్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో అనంత్ అంబానీ వాచ్ అందరినీ ఆకర్షించింది. కాగా, దీని గురించి నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. అయితే దీని విలువ చూస్తే.. దాని ఖరీదు అక్షరాల రూ.63 కోట్లు. దీంతో ఒక్కసారిగా నెటిజన్స్ షాక్ అవుతున్నారు. వామ్మో దీని ధర ఇంతనా అంటూ అవాక్కు అవుతున్నారు.

అయితే అనంత్ అంబానీ ధరించిన వాచ్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన 10 మోడల్స్ గడియారాలలో ఒకటైన ‘రిచర్డ్ మిల్లే RM 56-02’ బ్రాండ్. దీనిని బేస్ ప్లేట్ గ్రేడ్ 5 టైటానియంతో తయారు చేస్తారు. 0.35 మిమీ మందం కలిగిన టైటానియం సింగిల్ చట్రంతోపాటు.. సెరమిక్స్ కేబుల్ ఉపయోగించి కేస్ లోపల సస్పెండ్ చేయబడింది. RM 56-02 గురుత్వాకర్షణ ప్రభావాలను ఎదుర్కోవడం ద్వారా సమయపాలన ఖచ్చితత్వాన్ని పెంపొందించే టూర్ బిల్లన్ ఎస్కేప్‌మెంట్‌ను కలిగి ఉంది. ఈ ఖరీదైన వాచ్ $2.2 మిలియన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే రూ. 18.2 కోట్ల నుంచి ప్రారంభమవుతుదంట.

Read More..

అనంత్ అంబానీ ఫ్రీ వెడ్డింగ్ వేడుకల్లో చరణ్‌కు అవమానం జరగలే.. వీడియోతో క్లారిటీ

Advertisement

Next Story