- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
‘అమ్మకు ఇష్టమైన పాట’తో మెస్మరైజ్ చేసిన సింగర్ సునీత.. వీడియో వైరల్
దిశ, సినిమా : సింగర్ సునీత.. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరిది. గాయనిగానే కాకుండా.. డబ్బింగ్ ఆర్టిస్టు కూడా అలరించింది. ఆమె పాట విని మైమరచిపోని అభిమానులు లేరనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. తియ్యటి స్వరం, చక్కని రూపం ఆమెకు దేవుడిచ్చిన వరంగా అభివర్ణిస్తుంటారు అభిమానులు, సినీ ప్రముఖులు.
తేట తెలుగు పాటలతో, తేనెలాంటి మాటలతో సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీతకు19 సంవత్సరాల వయస్సులోనే పెళ్లి అయింది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే పలు కారణాలతో ఆమె తన మొదటి భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత ప్రముఖ బిజినెస్ మ్యాన్ రామ్ వీరపనేనిని రెండవ పెళ్లి చేసుకుంది. వృత్తి జీవితంతోపాటు కుటుంబ జీవితంలోనూ సంతోషంగా ఉంది.
తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌కు సంబంధించిన అనేక విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుకునే సునీత.. తాజాగా తన తల్లి పాదాలకు దగ్గరగా కూర్చొని, ఆమె ఒడిలో తలవాల్చుతూ ఉన్న ఒక వీడియోను షేర్ చేయగా, ప్రస్తుతం అది వైరల్ అవుతోంది. వీడియో కింద ‘అమ్మకు ఇష్టమైన పాట’ అనే క్యాప్షన్ ఇచ్చిన సునీత, తల్లికోసం స్వయంగా ఒక మధురమైన పాటపాడి వినిపిస్తుండగా.. అది వింటున్న ఆ మాతృమూర్తి ఆనందంతో పరవశించిపోతోంది.