బాయ్ ఫ్రెండ్‌కు లిప్ లాక్ ఇస్తూ రెచ్చిపోయిన అమీ జాక్సన్.. కొడుకు ముందు ఇలాంటి పనులేంటని ఏకిపారేస్తున్న నెటిజన్లు!

by Hamsa |   ( Updated:2024-06-06 12:10:04.0  )
బాయ్ ఫ్రెండ్‌కు లిప్ లాక్ ఇస్తూ రెచ్చిపోయిన అమీ జాక్సన్.. కొడుకు ముందు ఇలాంటి పనులేంటని ఏకిపారేస్తున్న నెటిజన్లు!
X

దిశ, సినిమా: హీరోయిన్ అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు తెలుగు, తమిళం, హిందీ ఇంగ్లీష్, కన్నడ వంటి భాషల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా తెలుగులో అభినేత్రి, రామ్ చరణ్ ఎవరు, ఐ మనోహరుడు, వంటి సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. కానీ గత కొద్ది కాలంగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది. ఇప్పటికే మొదటి భర్తతో ఓ కొడుకు కని విడిపోయింది. ఇటీవల బ్రిటిష్ నటుడితో ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. అంతేకాకుండా నిశ్చితార్థం కూడా అయిపోయినట్లు తెలిపింది.

అప్పటి నుంచి ప్రియుడు, కొడుకుతో వెకేషన్స్‌కు వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా, అమీ జాక్సన్ ట్రిప్‌కు వెళ్లి ఎంజాయ్ చేస్తున్న ఫొటోలు షేర్ చేసింది. ‘‘A lil slice of Sicilian Heaven’’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ ఫొటోల్లో అమీ జాక్సన్ ప్రియుడికి లిప్ లాక్ ఇస్తూ రెచ్చిపోయింది. అలాగే కొడుకు మెడ్డపై ముద్దు పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతుండగా.. వాటిని చూసిన వారు కొడుకు ముందు ఇలాంటి పనులేంటని ఏకీ పారేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed