Amrita Rao: నటికి ఊహించని షాక్ ఇచ్చిన మేనేజర్.. కెరీర్ కొలాప్స్

by Prasanna |
Amrita Rao: నటికి ఊహించని షాక్ ఇచ్చిన మేనేజర్.. కెరీర్ కొలాప్స్
X

దిశ, సినిమా : బాలీవుడ్ బ్యూటీ అమృతా రావు తన మేనేజర్ ఇచ్చిన షాక్ నుంచి ఇంకా కోలుకోలేదంటోంది. తను రచించిన ‘కపుల్ ఆఫ్ థింగ్స్‌’ పుస్తకాన్ని ఇటీవల విడుదల చేసిన నటి.. ఇందులో పొందుపరిచిన కెరీర్ అనుభవాలను ఒక్కొక్కటిగా షేర్ చేసుకుంటుంది. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ ‘వాంటెడ్’ కోసం ఆఫర్ వచ్చినప్పటికీ తన మేనేజర్ విషయం చెప్పకుండా ప్రతీకారం తీర్చుకున్నట్లు తెలిపింది. ‘ఓ సినిమా షూటింగ్ కోసం హోటల్లో బస చేస్తున్నా. అక్కడే ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వ్యక్తి కలిశాడు. ‘ఓహ్.. హాయ్ అమృతా! ఎలా ఉన్నావ్? మా డేట్స్ క్లాష్ కాకపోతే.. మీరు సల్మాన్‌తో ‘వాంటెడ్’లో బిజీగా ఉండేవారు’ అని చెప్పాడు. దీంతో అయోమయంగా అనిపించి వెంటనే మెనేజర్ వైపు చూశాను. ఒక నిమిషం తర్వాత ‘మీరు సమయం కేటాయించడం అసాధ్యం. అందుకే చెప్పలేదు’ అని షాక్ ఇచ్చాడు’ అని గుర్తుచేసుకుంది. ప్రభు దేవా దర్శకత్వం వహించిన ‘వాంటెడ్’ బిగ్ హిట్ కాగా సల్మాన్ సరసన అయేషా టకియా నటించింది.

Advertisement

Next Story