- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోమో సెక్స్, గే కంటెంట్‌తో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు నిండిపోయాయి.. స్టార్ నటి
దిశ, సినిమా: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల కంటెంట్ గురించి అమీషా పటేల్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘గదర్ 2’ సినిమా ప్రచారంలో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న నటి.. రీసెంట్‌గా ఓటీటీ వేదికలు అందిస్తున్న సిరీస్, సినిమాల గురించి తన అభిప్రాయం వ్యక్తం చేసింది. ‘చాలాకాలంగా ప్రజలు మంచి, స్వచ్ఛమైన సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే OTT అలాంటి స్టోరీని ఖచ్చితంగా అందించలేదు. ఇది (homosexuality, gay-lesbianism) స్వలింగ సంపర్కం, గే, లెస్బియన్‌లతో నిండి ఉంది. కాబట్టి ఆ దృశ్యాలు చూడకుండా నిరంతరం మీరు మీ పిల్లల కళ్లను కప్పేయాలి. లేదా మీ ఇంట్లో ప్రసారమయ్యే టెలివిజన్‌కి లాక్ చేయాలి. లేదంటే ఇంట్లో ఆ ప్లాట్‌ఫామ్‌లను యాక్సెస్ చేయలేరు’ అంటూ ఆసక్తికరంగా మాట్లాడింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న అమీషా వ్యాఖ్యలపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి.
Read More: 22 ఏళ్ల తర్వాత మరోసారి భారతీయులను అలరించనున్న ‘లగాన్’ నటి