- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ సినిమాలు మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్నా.. Ameesha Patel
దిశ, సినిమా: ప్రస్తుతం ‘గదర్ 2’ విజయాన్ని ఆశ్వాదిస్తున్న నటి అమీషా పటేల్ గతంలో తాను సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకోవడానికి గల కారణాలను వెల్లడించింది. రీసెంట్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షారూఖ్ ఖాన్ ‘చల్తే చల్తే’, సల్మాన్ ఖాన్ ‘తేరే నామ్’, సంజయ్ దత్ ‘మున్నా భాయ్ MBBS’లో తనకు ఆఫర్ వచ్చినప్పటికీ తిరస్కరించినట్లు చెప్పింది. ‘నిజంగా ఆ సినిమాలు మిస్ చేసుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్నా. అప్పుడు వరుస సినిమా డేట్‌లు ఉండటం వల్లే చేయలేకపోయా. ఆ మూవీస్ బిగ్ హిట్ అవుతాయని తెలిసినప్పటికీ అప్పటికే ఇతర ప్రాజెక్టులకు కమిట్‌మెంట్ ఇవ్వడంతో రిజెక్ట్ చేయక తప్పలేదు. నాకు చేయాలని ఆశ, ఆతృత ఉన్నప్పటికీ ఆ సమయంలోనే ‘ఒకేసారి అన్నిచోట్లా ఉండలేవు’ అని నా మనసు నాకు చెప్పింది’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక అనిల్ శర్మ దర్శకత్వం వహించిన ‘గదర్ 2’లో సన్నీ డియోల్ సరసన నటించగా ఈ మూవీ 7 రోజుల్లో బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 280.5 కోట్లు వసూల్ చేసి మూడు వందల కోట్లు దాటే దిశగా దూసుకుపోతుంది.