- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సమంత, నాగచైతన్యలను టార్గెట్ చేసిన అమెజాన్..! తీవ్ర అసంతృప్తిలో ఫ్యాన్స్
దిశ, వెబ్‌డెస్క్: నాగ చైతన్య, సమంత 2017 లో పెద్దల సమక్షంలో ప్రేమ పెళ్లి చేసుకుని.. కొన్ని అనివార్య కారణాల చేత 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. ఇక విడాకులు అనంతరం ఎవరి లైఫ్ వాళ్లు లీడ్ చేసుకుంటూ.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌ల్లో మెరుస్తున్నారు. అయితే.. సమంత నటించిన ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ వెబ్ సిరీస్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ‘సిటాడెల్’ వెబ్ సిరీస్‌తో అమెజాన్ ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
దీనికి సంబంధించిన షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. కానీ, ఏం జరిగిందో తెలియదు ఈ సిరీస్‌ను అమెజాన్ స్ట్రీమింగ్ చెయ్యకుండా వాయిదా వేస్తూ వస్తుంది. అదే విధంగా నాగ చైతన్య ‘ధూత’ వెబ్ సిరీస్ సైతం దాదాపు రెండేళ్లుగా హోల్డ్‌లో పెట్టింది అమెజాన్. ఇలా సమంత, నాగ చైతన్యల సిరీస్‌లు ఎప్పటికి స్ట్రీమింగ్ చేస్తారో అనే క్లారిటీ లేదు. దీంతో ఇద్దరి అభిమానులు కూడా అమెజాన్‌పై తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్ మాత్రం నాగ చైతన్య, సమంత సిరీస్‌లు ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతాయో చెప్పకుండా సస్పెన్స్‌లో పెట్టి ఫ్యాన్స్‌ను ఓ ఆడ ఆడేసుకుంటుంది.