- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amala: టబు-నాగార్జునల ఎఫైర్ ఇష్యూ చాలా బాధించిందంటున్న అమల
దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లపై ఎన్నో రూమర్లు వస్తుంటాయి. కానీ, కొన్ని సార్లు మాత్రం ఈ రూమర్లు నిజమవుతాయి. ఇలాంటి ఓ పుకార్లు అప్పట్లో నాగార్జున మీద కూడా చాలానే వినిపించాయి. ఆయన నటించిన ‘నిన్నే పెళ్లాడుతా’ మూవీ అప్పట్లో భారీ విజయం అందుకుంది. అయితే అదే టైమ్‌లో హీరోయిన్ టబుతో నాగార్జున డీప్ రిలేషన్‌లో ఉన్నాడని, నాగార్జున కోసమే టబు ముంబై నుంచి వచ్చేసిందని, వారిద్దరూ చాలా కాలం సహజీవనం చేశారంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే ఇటీవల శర్వానంద్ సినిమా ‘ఒకే ఒక జీవితం’లో అమల తల్లి పాత్రలో నటించి మెప్పించిన విషయం తెలిసిందే. కాగా ఓ ఇంటర్యూలో భాగంగా మాట్లాడిన అమల.. నాగార్జున-టబు ఎఫైర్ గురించిన రూమర్స్‌పై స్పందించింది. ‘అందరూ అనుకుంటున్నట్లుగా టబు, నాగార్జున మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. వారిద్దరూ మంచి స్నేహితులు. టబు నాకు మంచి ఫ్రెండ్. వాళ్లిద్దరి గురించిన తప్పుగా మాట్లాడుకోవడం బాధగా అనిపించింది. నేను చాలా సంతోషంగా ఉన్నా. నా భర్తపై నాకు పూర్తి నమ్మకం ఉంది’ అంటూ చెప్పుకొచ్చింది.