Poonam Kaur: అల్లు vs మెగా వార్.. పూనమ్ సపోర్ట్ ఎవరికంటే? (పోస్ట్)

by Hamsa |   ( Updated:2024-08-28 14:34:44.0  )
Poonam Kaur: అల్లు vs మెగా వార్.. పూనమ్ సపోర్ట్ ఎవరికంటే? (పోస్ట్)
X

దిశ, సినిమా: అల్లు అర్జున్, మెగా ఫ్యామిలీ మధ్య వివాదం నడుస్తున్నట్లు గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ జనసేనకు సపోర్ట్ చేయకుండా వైసీపీకి సపోర్ట్‌గా ఉండటంతో పలు పుకార్లు షికారు చేశాయి. ఈ క్రమంలో మారుతి నగర్ సుబ్రమణ్యం ఈవెంట్‌ తర్వాత ఈ అల్లు vs మెగా వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తనకు ఇష్టమైన వారి కోసం ఎక్కడికైనా వస్తా ముఖ్యంగా నా ఫ్యాన్స్ కోసం అని అల్లు అర్జున్ చేసిన కామెంట్లు అందరిలో అనుమానాలను పుట్టిస్తున్నాయి.

ఇంతకు ముందుకు మెగా ఫ్యాన్స్ వల్లే తనకు అండగా ఉన్నారని చెప్పిన ఆయన ఇప్పుడిలా మాట్లాడటంతో మెగా, అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతోంది. ఈ క్రమంలో.. తాజాగా, వివాదాస్పద నటి పూనమ్ కౌర్ ట్విట్టర్ వేదికగా తన సపోర్ట్ ఎవరికో తెలిపింది. ఓ మ్యాచ్‌లో అల్లు అర్జున్, స్నేహ పక్కన కూర్చున్న ఫొటో షేర్ చేస్తూ రెడ్ హార్ట్ సింబల్ షేర్ చేసింది. అలాగే ప్రేమ పంచుతూనే వారికోసం ప్రార్థిస్తాను అనే క్యాప్షన్ పెట్టింది. ఇక అది చూసిన మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మెగా ఫ్యామిలీకి కాకుండా ఇండైరెక్ట్‌గా అల్లు అర్జున్ సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపిందని చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed