- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రభాస్ కల్కి మూవీపై అల్లు అర్జున్ రివ్యూ..! ఇక మాటల్లేవంటూ ప్రశంసల జల్లులు..!
దిశ, సినిమా: ప్రభాస్ ‘కల్కి’ మూవీ థియేటర్స్‌లో విడుదలై హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ అన్ని అందరినీ ఆకట్టుకున్నాయి. అలాగే కలెక్షన్ల పరంగా అదరగొడుతుంది. ఇప్పటికే ఈ సినిమా చూసిన సెలబ్రిటీలు కూడా నాగ్ అశ్వీన్‌తో పాటు మిగతా మూవీ టీమ్‌ను అభినందిస్తూ పోస్టులు పెట్టారు. అయితే తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా X వేదికగా కల్కి సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఆ పోస్ట్‌లో.. కళ్లు చెదిరే విజువల్స్‌తో కనులపండుగలా కల్కి మూవీ ఉందని.. సూపర్ హీరో తరహాలో తన ప్రతిభతో ఈ భారీ చిత్రానికి ప్రాణం పోసిన మిత్రుడు ప్రభాస్‌కు అభినందనలు. అమితాబ్ బచ్చన్ గారు.. మీరు నిజంగా స్ఫూర్తి ప్రదాత. ఈ సినిమాలో మీ నటన చూశాక ఇక మాటల్లేవ్. కమల్ సర్.. మీ పెర్ఫార్మెన్స్‌కు ప్రణామాలు. మీరు భవిష్యత్తులో ఇలాంటి పాత్రలు మరొన్నో చేయాలని ఆశిస్తున్నాను. డియర్ దీపికా అదరగొట్టావు. సునాయసంగా నటించావు. డియర్ దిశాపటానీ నువ్వు స్క్రీన్ పై ఆకర్షణీయంగా కనిపించావు.
అదే విధంగా నటీ నటులకు, టెక్నీషియన్లకు ముఖ్యంగా సినిమాటోగ్రఫీ, ఆర్ట్, ఎడిటింగ్, మేకప్ విభాగానికి అభినందనలు. ఈ ఘనత వైజయంతీ మూవీస్‌కు, అశ్వనీదత్, స్వప్న దత్, ప్రియాంక దత్‌కు దక్కుతుంది. ఇండియన్ మూవీ ప్రమాణాలను పెంచే బృహత్తర చిత్రాన్ని అందించారు. నాగ్ అశ్విన్ ప్రతి సినిమా ప్రేమికులు ఆశ్చర్యపోయేలా మూవీని తెరకెక్కించారు. మూస ధోరణులను ధ్వంసం చేసి ఈ తరం కోసం సరికొత్త బాటలు వేసిన ఫిలింమేకర్ నాగ్ అశ్విన్. నా అభినందనలు. చివరగా అంతర్జాతీయ స్థాయి చిత్రాలకు దీటుగా మన సాంస్కృతిక సున్నితత్వాలతో వెండితెరపైకి వచ్చిన చిత్రం కల్కి 2898 ఏడీ' అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై నాగ్ అశ్విన్ స్పందిస్తూ థాంక్యూ పుష్ప రాజ్ గారు అంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం అల్లు అర్జున్ పెట్టిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.