Allu Arjun: వినాయకుడికి పూజ చేసిన అల్లు అర్జున్ గారాలపట్టి.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో

by Hamsa |
Allu Arjun: వినాయకుడికి పూజ చేసిన అల్లు అర్జున్ గారాలపట్టి.. నెట్టింట వైరల్ అవుతున్న క్యూట్ వీడియో
X

దిశ, సినిమా: దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ రోజు ఘనంగా వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటున్నారు. దేశవిదేశాల్లో మట్టి గణపతి ప్రతిమలను పెట్టి తొలి పూజలు చేసి ప్రసాదాలు అందరికీ పెడుతున్నారు. అయితే సినీ సెలబ్రిటీలు సైతం గణపయ్యకు పూజలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో.. తాజాగా, అల్లు అర్జున్ ఇంట్లో ఆయన గారాలపట్టి అర్హ పూజ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, అల్లు అర్హ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫస్ట్ మూవీనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత శాకుంతలంలో అర్హ లీడ్ రోల్ చేసింది. ఇందులో తన ముద్దు ముద్దు మాటలతో అందరిని మంత్రముగ్ధులను చేసింది.

ఆ తర్వాత ఏ సినిమా చేయనప్పటికీ ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉందనడంలో అతిశయోక్తి లేదు. అర్హకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు స్నేహ రెడ్డి నెట్టింట షేర్ చేస్తూ ఉంటుంది. అవి నిమిషాల్లోనే వైరల్ అయిపోతుంటాయి. ఇదిలా ఉంటే.. అల్లు అర్జున్ ప్రజెంట్ పుష్ప-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ పాన్ ఇండియా సినిమా డిసెంబర్ 6న గ్రాండ్‌గా వరల్డ్ వైడ్‌గా విడుదల కాబోతుంది. నవంబర్ నుంచి ప్రమోషన్స్ స్టార్ట్ కాబోతున్నాయి. అయితే పుష్ప-2 నుంచి ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ అన్ని భారీ అంచనాలను పెంచేశాయి. ఈ మూవీ థియేటర్స్‌లోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

Advertisement

Next Story