అల్లు అర్జున్ చెప్పింది చాలా విలువైనది.. ఇప్పటికీ పాటిస్తున్నా: కాజల్ అగర్వాల్

by Hamsa |
అల్లు అర్జున్ చెప్పింది చాలా విలువైనది.. ఇప్పటికీ పాటిస్తున్నా: కాజల్ అగర్వాల్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కాజల్ కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయింది. ఓ బిడ్డకు తల్లి అయి ఫ్యామిలీ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి పలు చిత్రాల్లో నటిస్తోంది. కాజల్ అగర్వాల్ నటించిన ‘సత్యభామ’ లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా తెరకెక్కింది. అయితే ఈ మూవీ మే 31న విడుదల కాబోతుంది.

సత్యభామ ప్రమోషన్స్‌లో పాల్గొన్న కాజల్, అల్లు అర్జున్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఓ షోలో పాల్గొని ‘‘ అల్లు అర్జున్‌లో సినిమాలు చేసినప్పుడు నాకు చాలా విలువైన సలహా ఇచ్చాడు. నేను ఇప్పటికీ దాన్ని పాటిస్తున్నాను. కెమెరా ఆఫ్ అయ్యాక కూడా అదే ఎమోషన్‌ను కొంచెం సేపు క్యారీ చేయాలని.. ఎడిటింగ్ సమయంలో అది ఉపయోగపడుతుందని అన్నాడు. ఆ సలహా నాకు ఇప్పటికీ ఉపయోగపడుతుంది’’ అంటూ చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story

Most Viewed